బంగాళాఖాతంలో భూకంపం..చెన్నైలో భూప్రకంపనలు

24 Aug, 2021 14:50 IST|Sakshi

సాక్షి,చెన్నైబంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో  చెన్నైలోని పలుచోట్ల స్వల్పంగా  భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి  ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది.

చదవండి:మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు