Earthquake: దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు

26 Nov, 2023 09:22 IST|Sakshi

దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలోని సోనిపట్‌లో ఉదయం 4 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై మూడుగా నమోదైంది. 

రెండో భూకంప కేంద్రం అస్సాంలోని దర్రాంగ్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉంది. ఇది ఉదయం 7:36 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడుగా  నమోదయ్యింది. అయితే ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం కనిపించలేదు. ప్రజలు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
 

గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా  పలుచోట్ల భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 3న నేపాల్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. దీని కారణంగా 70 మందికి పైగా జనం మరణించారు. అదే సమయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా పలువురు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ స్వల్ప భూకంపాలు భారీ భూకంపాలకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం

మరిన్ని వార్తలు