మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో భూకంపం

24 Jun, 2021 15:50 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. కాగా భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే దానిపై నివేదికలు అందలేదని పేర్కొంది. నాసిక్‌కు 87 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ నెల 21న అసోం నాగాన్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.8 ప్రకంపనలు వచ్చాయి. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.

మరిన్ని వార్తలు