అసోంలో ఒకే రోజు రెండుసార్లు కంపించిన భూమి

10 May, 2021 10:34 IST|Sakshi

గువాహ‌టి: అసోంలో మరోసారి భూమి కంపించింది. ఈ రోజు ఉద‌యం 7.05 గంట‌ల‌కు న‌గౌన్ స‌మీపంలో భూకంపం ఏర్పడింది. భూకంపం 26. 49 డిగ్రీల అక్షాంశాలు, 92.46 డిగ్రీల రేఖాంశాల వద్ద 23 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.0గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సెస్మాల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది.ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం కానీ జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది. కాగా, అర్ధరాత్రి కూడా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.7 గా నమోదైంది. గత కొన్నిరోజుల నుంచి వరుసగా అసోంలో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి.

చదవండి: భారీ భూకంపం: వీడియో వైరల్‌ 

మరిన్ని వార్తలు