5 States Assembly Polls Schedule 2023: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు విడుదల.. తెలంగాణలో ఎప్పుడంటే..?

9 Oct, 2023 12:04 IST|Sakshi

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న కౌంటింగ్

తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశమైంది.

ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..?
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.  ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న మొదటి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగగా.. మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్‌ జరగనుంది. 

రాష్ట్రం పోలింగ్‌ కౌంటింగ్‌ సీట్లు
తెలంగాణ నవంబర్‌ 30 డిసెంబర్‌ 3 119
రాజస్థాన్‌ నవంబర్‌ 23 డిసెంబర్‌ 3 200
మధ్యప్రదేశ్‌ నవంబర్‌ 17 డిసెంబర్‌ 3 230
మిజోరం నవంబర్‌ 7 డిసెంబర్‌ 3 40
ఛత్తీస్‌గఢ్‌ నవంబర్‌ 7, నవంబర్‌ 17 డిసెంబర్‌ 3 90

ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 

5 రాష్ట్రాల్లో 679 నియాజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 40 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగా 60 లక్షల మంది ఓటర్లు చేరారు. 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.  తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ 879 మందికి ఒక పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల ఓటర్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 

ఇదీ చదవండి: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్‌మీట్‌.. షెడ్యూల్‌ విడుదల..

‘సాక్షి’ తెలుగు న్యూస్‌ కోసం వాట్సాప్‌ చానల్‌ ఫాలో అవ్వండి

మరిన్ని వార్తలు