ఇంటి నుంచి ఓటేయాలంటే..

5 Oct, 2020 07:57 IST|Sakshi

న్యూఢిల్లీ: 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసేందుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు లేఖ ద్వారా సూచించింది. ఇందులో భాగంగా ఇంటి నుంచి ఓటు వేసే వారికి బూతు స్థాయి అధికారి 12డీ దరఖాస్తు అందిస్తారు. నోటిఫికేషన్‌ వచ్చిన 5 రోజుల్లోగా దాన్ని నింపాలి. నింపిన దరఖాస్తును బీఎల్‌ఓ బూతు స్థాయి అధికారి తీసుకొని రిటర్నింగ్‌ అధికారికి అందిస్తారు. ఈ ప్రక్రియ అన్ని రకాల సాధారణ ఎన్నికలకు, ఉపఎన్నికలకు, లోక్‌ సభ సీటుకు జరగనున్న ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆ లేఖలో పేర్కొంది. ఈ నెల 28 నుంచి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  

ఇందుకోసం ‘పీడబ్ల్యూడీ’ యాప్‌ను ఎన్నికల సంఘం తయారు చేసింది. 80 సంవత్సరాలు దాటిన వారు, దివ్యాంగులు ఇక నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అక్టోబర్‌ 28 నుంచి జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీంతో పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం

మరిన్ని వార్తలు