వయనాడ్‌ ఉపఎన్నికపై స్పందించిన ఈసీ

29 Mar, 2023 13:57 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హతవేటు నేపథ్యంలో.. వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికకు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు షెడ్యూల్‌ ప్రకటిస్తారనే ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో మీడియా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని  ఈ పరిణామంపై స్పందించమని కోరింది. 

వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటనకు తొందరేముందని అన్నారు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. పరువు నష్టం దావా కేసులో జైలు శిక్ష పడ్డ రాహుల్‌ గాంధీకి.. కోర్టు ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఇచ్చిన సంగతినీ సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియా వద్ద ప్రస్తావించారు. కోర్టు తీర్పు తర్వాతే.. ఏ నిర్ణయమన్నది ప్రకటిస్తామని ఈసీ స్పష్టత ఇచ్చారు. 

మరోవైపు ఇదే విధంగా అనర్హతవేటు ఎదుర్కొన్న లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని ఇవాళ లోక్‌సభ సెక్రటేరియెట్‌ పునరుద్ధరించిన సంగతి తెలిసింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటుగా యూపీ, ఒడిశా, మేఘాలయా అసెంబ్లీ స్థానాలకు, అలాగే పంజాబ్‌లోని జలంధర్‌ ఎంపీ స్థానానికి సైతం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. 

ఇదీ చదవండి: అనూహ్యం.. ఫైజల్‌ అనర్హతవేటు ఎత్తివేత

మరిన్ని వార్తలు