ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. బిజినెస్‍మేన్‌ సమీర్ మహేంద్రు అరెస్టు.. నెక్స్ట్‌ ఎవరు?

28 Sep, 2022 11:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిజినెస్‌మేన్‌ సమీర్ మహేంద్రును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఇండోస్పిరిట్ సంస్థ ఎండీ అయిన ఆయనను ఇంట్లో కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుంది.  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో సమీర్‌ పేరును కూడా సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. ఈ స్కీం అమలు, అవకతవకల్లో ఆయన పాత్ర కూడా ఉందని అభియోగాలున్నాయి.

కాగా.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఏఎంఎల్‌ కంపెనీ సీఈఓ విజయ్‌ నాయర్‌ను అరెస్టు చేసిన మరునాడే సమీర్‌ను అధికారులు అరెస్టు చేయడం  గమనార్హం. అర్జున్‌ పాండే అనే వ్యక్తి మహేంద్రు నుంచి రూ.2కోట్ల నుంచి 4కోట్ల వరకు తీసుకున్నాడని, అతను విజయ్ నాయర్ మనిషి అని సీబీఐ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా 35 చోట్ల తనిఖీలు నిర్వహించింది ఈడీ. సమీర్ మహేంద్రు నివాసాల్లోనూ సోదాలు చేసింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నివాసంతో పాటు బ్యాంకు లాకర్లలోనూ అధికారులు తనఖీలు నిర్వహించారు. అయితే ఈడీ, సీబీఐకి తన వద్ద ఒక్క ఆధారం కూడా లభించలేదని, కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టారని సిసోడియా బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్‌ఐపై నిషేధం

మరిన్ని వార్తలు