పవన్‌ ముంజాల్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

2 Aug, 2023 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ:  మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ పవన్‌ ముంజాల్‌తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్‌లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్‌ ముంజాల్‌తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్, కస్టమ్స్‌(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్‌ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్‌లో పవన్‌ ముంజాల్‌ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్‌ ముంజాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది.

>
మరిన్ని వార్తలు