శివసేన ఎమ్మెల్యే నివాసంలో ఈడీ దాడులు

24 Nov, 2020 12:02 IST|Sakshi

ముంబై: శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి పలు చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ విషయాన్ని ఈడీ ఇంకా నిర్ధారించలేదు. ఇటీవలె ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే ప్రతాప్‌ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. థానేలోని ఓవాలా-మాజివాడ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ పేరు కంగనాపై విమర్శలతో పాపులారిటీని తెచ్చుకున్నారు. (ముంబై కార్పొరేషన్‌‌ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం?)

కంగనా ముంబైకి వస్తే మా ధైర్యవంతులైన మహిళలు ఆమెను చెంపదెబ్బ కొట్టకుండా వదిలిపెట్టరంటూ ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సమర్థిస్తూ ఎంతోమంది పారిశామ్రికవేత్తలను, సినీ తారలను సృష్టించే ముం‍బైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడం దారుణమని, ఇందుకు ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ట్వీట్‌ చేసి రాజకీయ వేడిని మరింత పెంచారు. అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రిని అవమానించారన్న ఆరోపణలపై రిపబ్లిక్‌ టీవీకి వ్యతిరేకంగా కేసు నమోదు ఫిర్యాదు చేశారు.  (నడిరోడ్డుపై ఎమ్మెన్నెస్‌ నేత హత్య )


 

>
మరిన్ని వార్తలు