గోల్డ్‌ స్కామ్‌: 303 పేజీల చార్జ్‌షీట్‌ దాఖలు

7 Oct, 2020 17:01 IST|Sakshi

తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కీంలో 303 పేజీల చార్జిషీట్‌ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ స్కామ్‌కు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు 25మంది సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశంకర్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఆగస్టు 12, 15న శివ శంకర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ  రికార్డ్ చేసింది. స్వప్న సురేష్‌తో కలిసి తన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాత్‌ పాటు ఆయన ఎస్‌బీఐ జాయింట్ బ్యాంక్ లాకర్ తెరిచారు. 

గోల్డ్ స్మగ్లింగ్ చేయటంలో స్వప్న సురేష్  కీలక సూత్రధారి అని ఈడీ నిర్థారించింది. స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును, బంగారాన్ని స్వప్న బ్యాంకు లాకర్లలో భద్ర పరచింది. ఇప్పటికే బ్యాంకు లాకర్లను ఎన్‌ఐఏ అధికారులు సీజ్ చేశారు. 2017 నుంచి  ఏ2 నిందితురాలు స్వప్న సురేష్‌తో తనకు  పరిచయం ఉన్నట్టు మాజీ ఐఏఎస్‌ అధికారి తెలిపారు. స్వప్న కుటుంబం సభ్యులతోనూ మాజీ ఐఏఎస్ కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు శివశంకర్‌ స్వప్నను ఆర్థికంగా ఆదుకున్నారు. స్వప్నను తన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌కు, శివశంకర్‌ 2018లో పరిచయం చేశారు. 

చదవండి: డ్ర‌గ్స్ దందాకు కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్‌కు లింక్!

మరిన్ని వార్తలు