National Herald case: హెరాల్డ్‌ హౌస్‌ సహా 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

2 Aug, 2022 14:35 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌-ఏజేఎల్‌ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. తాజాగా నేషనల్‌ హెరాల్డ్ హౌస్‌లో మంగళవారం సోదాలు నిర్వహించింది. నేషనల్‌ హెరాల్డ్‌ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజుల పాటు ప్రశ్నించిన వారంలోపే ఈ దాడులు చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా విచారణ సందర్భంగా.. న్యూస్‌పేపర్‌ నిర్వహణపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియాల్లో సోనియా, రాహుల్‌ గాంధీల పాత్రపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు జూన్‌లో రాహుల్‌ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది ఈడీ.

ఇదీ చదవండి: National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం

మరిన్ని వార్తలు