వంట నూనె : పదకొండేళ్ల తర్వాత..

26 May, 2021 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖల లెక్కలు ధృవీకరిస్తున్నాయి. దశాబ్దకాలంగా ఎన్నడూ లేనంత వ్యత్సాలతో వంట నూనె అధిక ధరకు చేరుకుంది. కరోనా, లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో వంట నూనె ధరలు మరింత పెరగడానికి కారణాలని  గణాంకాలు చెప్తున్నాయి. 

దేశంలో ఎక్కువగా వాడుతున్న ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్స్​ ధర సగటున మే నెలలో బాగా పెరిగిందని, గత పదకొండేళ్లలో ఇదే ఎక్కువని​ తెలుస్తోంది. పల్లీ, ఆవ, వనస్పతి, సోయా, సన్​ఫ్లవర్​, పామ్​.. ఇలా దాదాపు ప్రతీ ఆయిల్​ మీద ప్రభావం పడిందని అఫీషియల్​ డేటా వెల్లడించింది. ముఖ్యంగా కరోనా మధ్యకాలంలో లాక్​డౌన్​ల వల్ల రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవిలకు విఘాతం కలగడం కూడా వంట నూనె ధరలు పెరగడానికి ఒక కారణంగా ఆ డేటా​ వెల్లడించింది. 

ఎంతెంతంటే..
రాష్ట్రాల పౌర సరఫరా విభాగాలు సమర్పించిన డేటా ఆధారంగా ఆయిల్​ ధరలు.. జనవరి 2010 తర్వాత ఇప్పుడు అధిక వ్యత్యాసాలతో​ పెరిగాయని తెలుస్తోంది. సాధారణ నూనె 2010లో 63 రూపాయలకు కేజీ ఉండగా, ఇప్పుడది 155 రూపాయలకు చేరుకుంది.  ఆవ నూనె కేజీకి పోయినేది ఇదే టైంకి 118 రూపాయలు ఉండగా, 39 శాతం పెరిగి 164 రూపాయలకు చేరుకుంది. ఇక మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే పామ్​ ఆయిల్​ పిరం అయ్యింది. పోయినేడాది కేజీ పామ్​ ఆయిల్ ధర 88 రూపాయలుగా ఉండగా, ఇప్పుడు అది 131 రూపాయలకు చేరుకుంది. అంటే 49 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇదే పామ్ ఆయిల్ ధర 2010లో 49 రూపాయలుగా ఉంది.  మిగిలిన ఎడిబుల్ ఆయిల్స్​ ప్రస్తుత పౌర సరఫరా శాఖల లెక్కల ప్రకారం.. వేరుశనగ నూనె(పల్లీ) కేజీ రూ.175.50, వనస్పతి 127 రూపాయలు, సోయా 148 రూపాయలు, సన్​ఫ్లవర్​ 170 రూపాయలకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ నాలుగు ఆయిల్స్​ ధరలు 19 నుంచి 52 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 
 
తక్షణ చర్యల కోసం..
కాగా, ఎడిబుల్ నూనెల ధరల పెరుగుదలను పదకొండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యల కోసం ఫుడ్ అండ్​ పబ్లిక్​ డిస్ట్రిబ్యూషన్​ డిపార్ట్​మెంట్ సోమవారం స్టేక్​హోల్డర్స్ అందరితో ఒక సమావేశమైంది. ఆయిల్ ధరలు తగ్గే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఈ మీటింగ్​లో రాష్ట్రాలను కోరింది. అంతేకాదు కేంద్ర కూడా నిల్వలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు