చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం

17 Oct, 2023 13:55 IST|Sakshi

ఢిల్లీ: చంద్రయాన్‌ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్‌ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్‌సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది.  విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని    తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. 

చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై  తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు