కోడిగుడ్ల కొనుగోలులో భారీ కుంభకోణం.. మంత్రికి వ్యతిరేకంగా..

25 Jul, 2021 14:05 IST|Sakshi

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మహిళా, శిశు సంక్షేమశాఖలో పేదలకు అందజేసే కోడిగుడ్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని మహిళా కాంగ్రెస్‌ నాయకులు మైసూరులో ధర్నా నిర్వహించారు. మంత్రి శశికళా జొల్లె  చిత్రపటాలు, కోడిగుడ్ల ట్రేలను రోడ్డు మీద పెట్టి బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. మరోవైపు మంత్రి శశికళా స్పందిస్తూ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్నారు.

అమ్మాయిలను వేధిస్తే ఊరుకోం  
యశవంతపుర: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర సీపీ కమల్‌పంత్‌ హెచ్చరించారు. శనివారం ఆయన నందిని లేఔట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల సమావేశంలో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. బస్టాప్‌లు, కళాశాలల వద్ద యువకులు తిష్టవేసి అమ్మాయిలను వేధిస్తే ఉపేక్షించమని అన్నారు. నందిని లేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గంజాయి కేసుల సంఖ్య అధికం కావటంతో పోలీసులు రాత్రి గస్తీని పెంచాలని సూచించారు.   
 

మరిన్ని వార్తలు