ట్యూషన్‌ సెంటర్‌లో కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా

16 Oct, 2021 17:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సూరత్‌: ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకడంతో గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కలకలం రేగింది. ట్యూషన్‌ సెంటర్‌ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్లే విద్యార్థి ఒకరు ఈనెల 7న కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం 125 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురు కరోనా పాజిటివ్‌గా తేలారని సూరత్‌ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌(హెల్త్‌) ఆశిష్‌ నాయక్‌ తెలిపారు.

మరింత మందికి కరోనా సోకకుండా ట్యూషన్‌ సెంటర్‌ను వెంటనే మూసివేసినట్టు చెప్పారు. సూరత్‌ విద్యాసంస్థల్లో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలారంభంలో కొంత మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేటు స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 

సూరత్ నగరంలో ఇప్పటివరకు 1,11,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,09,975 రికవరీలు నమోదు కాగా, రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం సూరత్‌లో ఇప్పటివరకు మొత్తం 1,629 మంది కోవిడ్ -19 రోగులు మరణించారు. (చదవండి: కోవిడ్‌–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?)

మరిన్ని వార్తలు