యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు

17 Sep, 2021 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రఖ్యాత జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ నిర్వహించిన యూఎస్‌ నేషనల్‌ సైన్స్‌ బీ పోటిల్లో ఢిల్లీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు అద్వాయ్‌ మిశ్రా రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచంతో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులలో ఒకరిగా నిలిచాడు. నేషనల్‌ సైన్స్‌ బీ అనేది బయోలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఆస్ట్రనామీ, మ్యాథమెటిక్స్‌, తదితర శాస్త్ర రంగాలకి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నల బజర్‌ ఆధారిత సైన్స్‌ పోటీ.

(చదవండి: క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు)

ఈ బజర్‌ ఆధారిత ప్రాంతీయ, నేషనల్‌ చాంపియన్‌ షిప్‌ పోటికి విద్యార్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అద్యాయ్‌ మిశ్రా వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న ఇంటర్నేషనల్‌ జాగ్రఫీ బీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పై దృష్టి సారించనున్నాడు. వృత్తి రీత్యా తల్లిదండ్రులు అమెరికాలో ఉండటంతో వారితో 2018 వరకు అమెరికాలోనే ఉన్నాడు.  ప్రస్తుతం ఢిల్లీ పాఠశాలలో చదువు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మిశ్రా జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక సెంటర్‌ ఫర్‌ టాలెంటడ్‌ యూత్‌ (సీటీవై)లో కూడా ప్రవేశం పొం‍దాడు. ఈ యూనివర్సిటీలో మార్క్‌ జూకర్‌ బర్గ్‌ , గూగుల్‌ వ్యవస్థాపకులు రోడ్స్‌ స్కాలర్‌, మార్క్‌ ఆర్థర్‌ ఫెలోస్‌ తదితర ప్రముఖులు పూర్వ విద్యార్థలు కావడం విశేషం.

(చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. బస్సు ఒక్క అడుగు ముందుకు కదిలినా..)

మరిన్ని వార్తలు