Maha Political Crisis: సీఎం థాక్రేకు రెబల్‌ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు

23 Jun, 2022 12:58 IST|Sakshi

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప‍్పటికే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రభుత‍్వం, సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే.. సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప‍్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు. ఉద్ధవ్‌ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్‌ థాక్రే అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు. ఎమ్మెల్యేలను ఏనాడు సీఎం థాక్రే పట్టించుకోలేదుంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీ నేతలను బీజేపీ బంధించింది అంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్‌

మరిన్ని వార్తలు