త్రాచును మించిన జడ.. పడగ కూడా..!

27 Sep, 2023 11:44 IST|Sakshi

లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. 

A post shared by Meri Yamuna Ji (@meriyamunaji)

సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..!

ఇదీ చదవండి: ప్రతి గణేష్‌ విగ్రహానికీ క్యూఆర్‌ కోడ్‌


 

మరిన్ని వార్తలు