President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

9 Jun, 2022 15:31 IST|Sakshi

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్‌ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్‌ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక‍్రటరీ జనరల్‌ వ్యవహరించనున్నారు.

- ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 29. 
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2.
- జూలై 18న పోలింగ్‌,
- జూలై 21వ తేదీన కౌంటింగ్‌ జరుగనుంది.  

బ్యాలెట్‌ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి, ముస‍్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో గులామ్‌ నబీ ఆజాద్‌, నఖ్వీ, అరిఫ్‌ మహ‍్మద్‌ ఖాన్‌ ఉన్నారు. 

ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు