ఇది కదా అసలు ట్విస్ట్‌.. మహారాష్ట్ర సీఎం షిండే, ఉద్ధవ్‌ థాక్రేకు బిగ్‌ షాక్‌

23 Jul, 2022 10:17 IST|Sakshi

Maharashtra Shiv sena.. మహారాష్ట్రలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి మహా పాలి‘ట్రిక్స్‌’ చేరుకున్నాయి. 

అయితే, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్‌నాథ్‌ వర్గం, ఉద్ధవ్‌ థాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన పంచాయితీ.. ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల నేతలు పార్టీ తమదేనని ఈసీకి లేఖ రాశాయి. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా.. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం ఏక్‌నాథ్ షిండే వర్గం తమకే.. శివసనే పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. రెండు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ క్రమంలో ఈసీ.. రెండు వర్గాలకు ఊహించని విధంగా షాకిచ్చింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. శివసేన సభ్యులు ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నారనే ఆధారాలనూ సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు డాక్యుమెంట్లు ఈసీకి సమర్పించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మ‌ద్ద‌తుతో అసెంబ్లీ స్పీక‌ర్‌గా న‌ర్వేక‌ర్ ఎన్నిక‌య్యాక తీసుకున్న నిర్ణ‌యాలపై శివ‌సేన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు