ఎన్నికల రిజర్వేషన్‌ మహిళకు రావడంతో... పెళ్లి!

1 Apr, 2021 11:25 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం  పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్‌ మహిళకు రావడంతో కచ్చితంగా గ్రామంలో గెలవాలనే కోరికతో  45 ఏళ్ల  వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు.  దీంతో అతని భార్యను  పోటీలోనికి దింపుతున్నాడు. ఈ సమయంలో పెళ్లిలకు  మంచి ముహుర్తాలు  లేనప్పటికీ మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే... బాలియా జిల్లాలోని కరణ్‌చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) గత కొన్ని సంవత‍్సరాలుగా వారి గ్రామంలో సామాజిక సేవను చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు.

గ్రామ అభివృద్ధికి ఎంతగానో  పాటు పడుతున్న హథీ సింగ్‌  ఈ ఏడాది జరుగుతున్న పంచాయతీ  ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే సరికి రిజర్వేషన్‌ రూపంలో అతనికి ఆటంకం ఎదురైంది. ఆ గ్రామానికి సర్పంచ్‌గా  మహిళను  రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా హథీ సింగ్ మాట్లాడుతూ.. తన గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.  తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు.

చదవండి: 'పవన్‌కల్యాణ్‌ బాటలో'.. రెండో పెళ్లిపై నాగబాబు రియాక్షన్‌

మరిన్ని వార్తలు