ఎంత పని చేశావమ్మా... ఏనుగు!

9 Jun, 2021 14:51 IST|Sakshi

ఒక కాకికి దాహం వేసింది. నీటి కోసం వెతికితే ఓ కుండ అడుగున నీళ్లు కనిపించాయి. అప్పుడా కాకి ఒక్కో రాయి ఆ కుండలో వేస్తూ నీళ్లు పైకి వచ్చేలా చేసింది. చివరకు నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంది. ఇది మనలో చాలా మంది చిన్నప్పుడు విన్న కథ. అచ్చంగా అలాంటి కథనే గుర్తు చేసిందో ఏనుగు. ఏకంగా తొండంతో బోరింగు కొట్టింది. ఒకసారో , రెండు స్లాఓ కాదు  నీరు వచ్చే దాక బోర్‌ హ్యండిల్‌ని కొడుతూనే ఉంది. చివరకు నీళ్లు వచ్చాయి. తొండంతో నీళ్లు పట్టిన ఏనుగు..... కాళ్లు కడుక్కుంది.

తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కమలాపూర్‌లో  ఏనుగుల పార్కు ఉంది. ఇక్కడున్న రూప అనే ఏనుగు మిగిలిన ఏనుగుల్లాంటిది కాదు. దాహం వేస్తే నీటి తొట్టి వద్దకో.. ఏటి ఒడ్డుకో వెళ్లదు. నేరుగా అక్కడున్న చేతిపంపు దగ్గరకు వెళ్తుంది. తొండంతో హ్యాండిల్‌ను ఆడిస్తుంది. ఆపై వచ్చే నీళ్లతో దాహం తీర్చుకుంటుంది. ఒళ్లు తడుపుకుంటుంది

చదవండి:బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్‌ తెలియదు అనుకుంటా

మరిన్ని వార్తలు