వాయు కాలుష్యమే ప్రధాన కారణం: కేజ్రీవాల్‌

24 Nov, 2020 13:33 IST|Sakshi
కరోనావైరస్ పరిస్థితిపై ప్రధాని మోడీతో మాట్లాడిన కేజ్రీవాల్

ఢిల్లీ:  కరోనావైరస్ పరిస్థితిపై చర్చించడానికి ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ..  మంగళవారం పలు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయయ్యారు. ఆ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ థర్డ్‌ వేవ్ కరోనావైరస్ కేసులకు సంబంధించి మోదీకి నివేదిక అందజేశారు. దీనిలో భాగంగా కేంద్రం నుంచి అదనంగా 1,000 ఐసియు పడకలను అందించాలని కోరారు. కరోనావైరస్ థర్డ్‌ వేవ్‌ తీవ్రత ఉండటానికి వాయు కాలుష్యం ప్రధాన కారణమని కేజ్రీవాల్ మోదీకి తెలియజేశారు. ప్రక్క రాష్ట్రాలలో దహనం వల్ల కలిగే వాయు కాలుష్యం నుంచి బయటపడటానికి చొరవచూపించాల్సిందిగా మోదీకి విజ్ఞప్తి చేశారు.  ఇటీవల ఒక వ్యవసాయ సంస్థ అభివృద్ధి చేసిన బయో-డికంపోజర్‌తో చేసిన ప్రయోగాన్ని విజయవంతమైందని, కాలుష్య సమస్యకు ఇదొక చక్కటి పరిష్కారమని చెప్పారు. ఢిల్లీలో క్రమేపీ కరోనా కేసులు తగుతున్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల ఢిల్లీలో నవంబర్ 10 న అత్యధికంగా 8,600 కరోనా కేసులను నమోదయ్యాయి. అప్పటి నుంచి తాజా కరోనావైరస్ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నాయి. ఢిల్లీలో సోమవారం 4,454 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 121 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కరోనా కేసులు 5,34,317 గా ఉండగా, ఇప్పటివరకు 8,500 మందికి పైగా మరణించారు. గత 12 రోజుల్లో జాతీయ ఆసుపత్రిలో రోజువారీ మరణాల సంఖ్య 100 మార్కును దాటడం ఇది ఆరోసారి. ఆదివారం 121, శనివారం 111, శుక్రవారం 118, నవంబర్‌ 18న 131, నవంబర్‌ 12న 104 మంది మరణించారని అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు