ఫలానా చోటికే బదిలీ చేయాలని ఉద్యోగి పట్టుబట్టజాలడు

13 Sep, 2021 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగి ఫలానా ప్రాంతానికే బదిలీ చేయాలని పట్టుబట్టజాలడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  యూపీకి చెందిన మహిళా లెక్చరర్‌ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘ఒక ఉద్యోగి/ ఉద్యోగిని తనను ఫలానా చోటికే బదిలీ చేయాలనీ లేదా బదిలీ చేయరాదని పట్టుబట్టకూడదు. యాజమాన్యమే అవసరాలను అనుగుణంగా బదిలీలను చేపడుతుంది’అని పేర్కొంది.

అమ్రోహాలోని కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్‌ తనను గౌతమ్‌బుద్ధ నగర్‌లోని కళాశాలకు బదిలీ చేయాలని అధికారులను కోరగా తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లుగా అమ్రోహాలో పనిచేస్తున్న ఆమె, గతంలో 2000–2013 వరకు దాదాపు 13 ఏళ్లపాటు గౌతమబుద్ధ నగర్‌లో పనిచేసినట్లు గుర్తించిన హైకోర్టు తిరిగి అక్కడికే బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొంది. పనిచేసిన ప్రాంతానికే తిరిగి బదిలీ చేయాలని పట్టుబట్టరాదంటూ  పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు