మాతృభాషలో ఇంజనీరింగ్‌!

27 Nov, 2020 06:07 IST|Sakshi

వచ్చే విద్యాసంవత్సరం నుంచే 

కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్స్‌ సహా టెక్నికల్‌ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ కోర్సులతో సహా టెక్నికల్‌ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయమని యూజీసీని  సమావేశంలో ఆదేశించారు.
   
కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్‌ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్‌ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా