బాబోయ్‌ పైరసీ.. వేల కోట్లు ఉఫ్‌!

20 Mar, 2021 13:13 IST|Sakshi

మీడియా, వినోద పరిశ్రమకు తీవ్ర నష్టం

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్‌ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్‌ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్‌ –2000లోని సెక్షన్‌ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్‌ పేర్కొన్నారు.    

చదవండి:
ఆటోలో తిరుగుతున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు