ఏప్రిల్‌ 1 నుంచి పీఎఫ్‌ కొత్త నిబంధనలు

22 Feb, 2021 20:09 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి పీఎఫ్‌ లో కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నుంచి పొందిన వడ్డీకి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, రాబోయే ఏప్రిల్ 1 నుంచి అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి లభించే వడ్డీకి సైతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై పన్నులు‌ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పేర్కొన్నారు. 

అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 2021 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80సీ కింద ఎప్పటిలాగే మినహాయింపు లభిస్తుంది. పీఎఫ్‌ ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు అతను పని చేస్తున్న కంపెనీ కూడా ఉద్యోగి తరపున కొంత జమ చేసే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే పన్ను‌ ఉంటుంది. అయితే వీటిపై మార్గదర్శకాలను త్వరలో కేంద్రం విడుదల చేయనుంది.

చదవండి:

ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్‌ మద్దతు..గూగుల్‌ వైదొలిగేనా?

పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!

మరిన్ని వార్తలు