కరోనా సంక్షోభంలోనూ సానుకూల పురోగతి

21 Apr, 2021 15:09 IST|Sakshi

ఫిబ్రవరిలో 12.37 లక్షలుగా నమోదు

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో నికర కొత్త సభ్యత్వ సంఖ్య ఫిబ్రవరిలో దాదాపు 20 శాతం పెరిగి(2020 ఫిబ్రవరిలో కొత్త సభ్యత్వంతో పోల్చితే) 12.5 లక్షలకు చేరింది. కరోనా మహమ్మారి ప్రభావిత అంశాల నేపథ్యంలోనూ సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాల సాసుకూల తీరుకు ఇది అద్దం పడుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన పేరోల్స్‌ లెక్కలు ఈ విషయాన్ని తెలిపాయి. డేటా ప్రకారం, 2021 జనవరితో పోల్చితే ఫిబ్రవరి 2021లో నికర సబ్‌స్కైబర్ల సంఖ్య 3.52 శాతం పెరిగింది. 

ఫిబ్రవరి 2021 వరకూ ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓలో మొత్తం నికర కొత్త సభ్యత్వం మొత్తం 69.58 లక్షలుగా ఉంది. 2018-19లో మొత్తం కొత్త సబ్‌స్కైబర్ల సంఖ్య 61.12 లక్షలు కాగా, 2018-20లో ఈ సంఖ్య 18.58 లక్షలుగా ఉంది. సంఘటిత, పాక్షిక సంఘటిత రంగాలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన సామాజిక భద్రతా భవిష్యత్‌ నిధులను ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ అరు కోట్లకుపైగా క్రియాశీల సభ్యత్వం కలిగి ఉంది. 2018 ఏప్రిల్‌ నుంచి కొత్త సబ్‌ఫైబర్ల పేరోల్‌ డేటాను ఈపీఎఫ్‌ఓ విడుదల చేస్తోంది.

వడ్డీరేటు ఇలా...

ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20, 2020-21) 8.5 శాతంగా ఉంది. భవిష్యత్తులోనూ అత్యధిక స్థాయిలో రిటర్బ్స్‌ అందించడానికి తగిన వ్యూహాలను ఈపీఎఫ్‌ఓ అవలంభిస్తోంది. ఈ దశలో పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ ఈపీఎఫ్‌ఓ కలిగి ఉంది. 2015-16లో స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్‌ఓ ప్రారంభంచింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు, ఫ్రస్తుతం 15 శాతానికి చేరాయి. 

2018-19లో ఈపీఎఫ్‌ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65 శాతంగా ఉంది. 2019-20కి సంబంధించి వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది. కాగా మహమ్మారి కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నంగా ట్రస్టీల బోర్డ్‌ 2020-21లోనూ 8.5 శాతంగా వడ్డీరేటు నిర్ణయించింది. డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి పొందిన వడ్డీ అలాగే. ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ. అంశాలను పరిగణనలోకి. తీసుకుని రిటైర్మెండ్‌ ఫండ్‌ వ్యవహారాలను నిర్వహించే- ఈపీఎఫ్‌ ఓ అత్యున్నత నిర్ణయక విభాగం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) 8.5 శాతం వడ్డీరేటునే కొనసాగించాలని ఇటీవలే నిర్ణయించింది.

చదవండి: 

యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు