IPS Officer: మా ఆవిడ జిలేబీ తిననివ్వడం లేదు; నువ్వు ఇంటికి రా!

22 Jul, 2021 13:40 IST|Sakshi

ముంబై: ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ ట్విటర్‌ వేదికగా జిలేబీపై ఉన్న ఇష్టం గురించి వెల్లడించడం.. తన భార్య చేత ఇబ్బందులు పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ​ ఐపీఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సందీప్‌ మిట్టల్‌కు చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ప్రాణం. తన చిన్నతనంలో 25 పైసలకే జిలేబీలు కొనుక్కొని తినేవాడు. అలా రోజుకు మూడు నుంచి నాలుగు జిలేబీలు ఎంతో ఇష్టంగా ఆరగించేవాడు. పెరిగి పెద్దయ్యాకా కూడా ఆ ఐపీఎస్‌ ఆఫీసర్‌కు జిలేబీలపై మక్కువ పోలేదు. తన భార్యకు తెలియకుండా చాలాసార్లు దొంగతనంగా తినేవాడు. అయితే ఈ విషయం తన భార్యకు తెలిసిపోవడంతో అప్పటినుంచి ఆమె అతన్ని జిలేబీలు తిననివ్వడం లేదు.

దీంతో తన భార్యపై కోపాన్ని(ఫన్నీవేలో) ట్విటర్‌ వేదికగా రాసుకొచ్చాడు. '' చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు మా ఆవిడ జిలేబీలు తిననివ్వడం లేదు'' అని ట్వీట్‌ చేశాడు. భర్త జిలేబీ విషయం తెలుసుకున్న అతని భార్య వినూత్న రీతిలో రిప్లై ఇచ్చింది. ''మీరు ఈరోజు ఇంటికి రండి..'' అంటూ అసంపూర్తిగా కామెంట్‌ చేశారు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. '' బహుశా జిలేబీలు తిని తిని ఆ ఐపీఎస్‌ ఆఫీసర్‌కు షుగర్‌ వచ్చిదనుకుంటా.. పాపం ఐపీఎస్‌ ఆఫీసర్‌ను చూస్తే జాలేస్తుంది.. మీ చిన్నతనంలో జిలేబీల గురించి చెప్పి మాకు ఊరీలు తెప్పించారు..'' అని నెటిజన్లు కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు