ప్రెగ్నెన్సీ కోసం లద్దాఖ్‌కు విదేశీ యువతుల క్యూ

8 Jan, 2021 18:15 IST|Sakshi

లడాఖ్‌: సంతానం కోసం విదేశాల నుంచి యువతులు లద్దాఖ్కు క్యూ కడుతున్నారంట. అదేంటి పిల్లల కోసం విదేశీ యువతులు ఇక్కడకు రావడమేంటని అనుకుంటున్నారా. అవును  కేవలం గర్భం దాల్చడం కోసమే యురోపియన్‌ దేశాలకు చెందిన అమ్మాయిలంతా లద్దాఖ్కు వస్తున్నారంట. అయితే ఇందులో ఓ రహస్యం ఉంది. అదేంటంటే.. లద్దాఖ్లో ఆర్యన్‌ సంతానం నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్యన్‌లు అంటేనే ఆరు అడుగుల ఆజానుబాహులు, నీలి కళ్లు కలిగి అందంగా ఉంటారు. దీంతో ఆర్యన్‌ సంతానాన్ని పొందడానికి యురోపియన్‌ అమ్మాయిలు లద్దాఖ్కు ప్రతి ఏటా వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఆరు అడగులా ఆజానుబాహులుగా కనిపించే ఆర్యన్‌ అబ్బాయిలతో జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల నుంచి ప్రతి ఏటా అమ్మాయిలు ఇక్కడికి వచ్చి  శృంగారంలో పాల్గోని ఆర్యన్‌ సంతానం పొందుతున్నారు.

సంతానం కోసమే ప్రత్యేకంగా విదేశీ యువతులు లద్దాఖ్కు వస్తుండటంతో ఆర్యన్‌ వాలీకి ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ అని పేరు కూడా పెట్టారు. అయితే చరిత్ర ప్రకారం.. క్రీస్తుపూర్వం గ్రీకువీరుడు అలెగ్జాండ‌ర్ ఒక్కో రాజ్యాన్ని జ‌యిస్తూ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింధూ లోయకు వచ్చిన అలెగ్జాండ‌ర్‌.. ఆ త‌ర్వాత ఇండియాకు రాకుండానే వెనుదిరిగాడు. కానీ అత‌ని వెంట వ‌చ్చిన సైన్యంలో కొంత మంది సింధు లోయ వద్ద ఉండిపోయారంట. ఇక అప్ప‌టి నుంచీ సింధూ లోయ‌లో వద్ద నివసిస్తున్న వీళ్ల‌నే ఇప్పుడు చివ‌రి ఆర్య‌న్లుగా పిలుస్తున్నారు. ల‌ఢాక్‌లోని ఐదు గ్రామాల్లో చివ‌రి ఆర్య‌న్లు నివ‌సిస్తున్నారు. నియంత్ర‌ణ రేఖ‌కు స‌మీపంలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు