ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య!

27 Jan, 2023 12:28 IST|Sakshi

బీజేపీకి చెందిన మాజీ కార్పోరేటర్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, తమ కుమారుడికి అరుదైన వ్యాధి వచ్చిన కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తండ్రి, బీజేపీ నేత సంజీవ్‌ మిశ్రా తెలిపారు. తమ మృతికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాకు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్‌ సంజీవ్‌ మిశ్రా(45)కు భార్య నీలం(42), ఇదర్దు కుమారులు అన్మోల్‌(13), సార్థక్‌(7) ఉన్నారు. అయితే, గత కొద్ది రోజలుగా సంజీవ్‌ కొడుకు.. అరుదైన కండరాల వ్యాధి(muscular dystrophy)తో బాధపడుతున్నాడు. దీంతో, తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగయ్యేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఎన్ని ఆసుపత్రుల తిరిగినా అతడిని నయం కాకపోవడంతో సంజీవ్‌ మిశ్రా మనస్థాపానికి లోనయ్యారు. 

ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పిల్లల ఆరోగ్య పరిస్థితి కారణంగా దంపతులు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తమ కుమారులిద్దరికీ విషం తాగించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా పాయిజన్‌ సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పిల్లలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. సంజీవ్‌ మిశ్రా, నీలం మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వీరి ఆత్మహత్యకు ముందు సంజీవ్‌ మిశ్రా ట్విట్టర్‌ వేదికగా.. శత్రువుల పిల్లలను కూడా దేవుడు ఈ వ్యాధి నుంచి తప్పించాలి. నేను నా పిల్లలను రక్షించలేను.. అందుకే ఇకపై జీవించాలని అనుకోవడం లేదు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, వీరి ఆత్మహత్యలపై స్థానిక బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. 

మస్కిల్‌ డిస్ట్రోఫీ అంటే.. 
వారసత్వ (జన్యు) వ్యాధుల కారణంగా కండరాలు బలహీన పడటాన్ని కండరాల డిస్ట్రోఫీ సూచిస్తుంది. ఈ పరిస్థితిని ఒక రకమైన మయోపతి, అస్థిపంజర కండరాల వ్యాధిగా పేర్కొంటారు. ఈ‍ వ్యాధి కారణంగా, కండరాలు కుంచించుకుపోతాయి, బలహీనపడతాయి. కండరాల బలహీనత కారణంగా నడవడం, రోజువారీ కార్యకలాపాలు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ వ్యాధి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది అరుదైన వ్యాధి. దీని కారణంగా వీల్‌ చైర్‌ కూడా పరిమితమయ్యే అవకాశం ఉంటుంది.

కండరాల బలహీనత రకాలు.. 
కండరాల డిస్ట్రోఫీలో 30కి పైగా రూపాలు ఉన్నాయి.

- డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD): ఈ పరిస్థితి 2 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలు, అమ్మాయిల్లో కనిపిస్తుంది. వీరు పరుగెత్తడం, నడవడం లేదా దూకడం వంటి కష్టంగా చేస్తారు.  వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది పిల్లల గుండె, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. DMD అనేది కండరాల బలహీనతకు చెందిన అత్యంత సాధారణ రూపం. ఇది ఉత్తర అమెరికా, ఐరోపాలోని 1,00,000 మంది పిల్లలలో దాదాపు ఆరుగురిని ప్రభావితం చేస్తుంది.

- బెకర్ మస్కులర్ డిస్ట్రోఫీ (BMD): BMD రెండవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. BMD లక్షణాలు 5-60 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా కనిపిస్తాయి, కానీ, సాధారణంగా యుక్తవయస్సులో వస్తాయి. పురుషులకు BMD వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి తొంటి, తొడ, భుజాల కండరాలను, చివరికి గుండెను ప్రభావితం చేస్తుంది. 

- ఫేసియోస్కాపులోహ్యూమెరల్ మస్కులర్ డిస్ట్రోఫీ (FSHD): FSHD అనేది మూడవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. ఈ వ్యాధి ముఖం, భుజం బ్లేడ్‌లు, పై చేతులపై కండరాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు 20 సంవత్సరాల కంటే ముందే కనిపిస్తాయి. 

పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత (CMD): CMD పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత. శిశువు బలహీనమైన కండరాలు, వంగిన వెన్నెముక,  కీళ్ళు చాలా గట్టిగా లేదా వదులుగా ఉండవచ్చు. CMD ఉన్న పిల్లలకు అభ్యాస వైకల్యాలు, మూర్ఛలు, దృష్టి సమస్యలు ఉండవచ్చు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు