చూస్తుండగానే కుప్పకూలింది.. పెద్ద గండం తప్పింది

4 Jul, 2021 21:05 IST|Sakshi

లక్నో: లక్నోలో మాజీ ఎంపీ దావూద్ అహ్మద్ ఐదంతస్తుల బిల్డింగ్‌ కూల్చివేతకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్షణాల్లో కూలిపోయిన ఆ బిల్డింగ్‌ కింద ఎవరు లేకపోవడంతో పెద్ద గండం తప్పినట్లయింది. లక్నోలోని రెసిడెన్సీ సురక్షిత స్థలానికి అడ్డుగా ఉందంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అభ్యంతరం తెలపడంతో బిల్డింగ్‌ను కూలగొట్టారు. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన చాలా భవనాల వారసత్వ సంపదను దెబ్బతీస్తుందని అక్కడి స్థానికలు ఇటీవలే కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టుకు ఆర్కియాలజికల్‌ డిపార్ట్‌మెంట్‌ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర‍్టు అనుమతితో బిల్డింగ్‌ను కూల్చివేశారు.

కాగా పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చి బిల్డింగ్‌ను కూల్చే ప్రయత్నం చేశారు. క్షణాల్లోనే బిల్డింగ్‌ కూలిపోగా.. మట్టిపెళ్లలు వచ్చి క్రేన్‌ ఆపరేటర్‌కు తగిలాయి. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా అక్కడ ఉన్న వాహనాల్లో చాలా వరకు ధ్వంసం అయ్యాయి. ''బిల్డింగ్‌ కూల్చడం బాగానే ఉంది.. కానీ పెద్ద గండం తప్పింది..'' అని నెటిజన్లు కామెంట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు