Rajendra Bahuguna Suicide Death: మనవరాలిపై లైంగిక వేధింపులు.. మన‌స్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య

27 May, 2022 16:18 IST|Sakshi

డెహ్రాడూన్‌: కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్‌వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. కాగా తన కూతురిని లైంగిక వేధిస్తున్నట్లు కోడలు మామ రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది జరిగిన మూడు రోజులకే బహుగుణ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

బహుగుణ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇక తాను బతకలేనని, చనిపోతున్నట్లు పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునేలోపే బహుగుణ ఇంటి ముందు ఉన్న వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అయితే లౌడ్‌ స్పీకర్‌ ఉపయోగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, కిందికి దిగి రావాలని పోలీసులు మాజీ మంత్రిని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసుల మాటలు వినకుండా ‘నేను ఏం తప్ప చేయలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ పదేపదే గట్టిగా అరిచాడు. ఒకానొక సమయంలో బహుగుణ పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందికి దిగివస్తడనుకున్న క్రమంలో అనుహ్యంగా వాటర్‌ ట్యాంక్‌పై తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు విడిచాడు.
చదవండి: హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్‌! నాలుగేళ్ల జైలు శిక్ష

పోలీసులు, ఇంటి పొరుగువారు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే కోడలు చేసిన ఆరోపణలపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.మరోవైపు తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించారని కొడుకు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి అలాగే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడైన బహుగుణ 2004-5లో ఎన్‌డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు