పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు

28 Dec, 2020 22:08 IST|Sakshi

పోలీస్ బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

సాక్షి, ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ జిల్లా కలేపాల్-పోరో కాకారి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు. మృతి చెందిన నక్సల్స్ ఐదు లక్షల రివార్డు వున్న ఐతి మాండవీ, మరో మావోయిస్ట్ రెండు లక్షల రివార్డు వున్న బెజ్జి మాండవీ గా గుర్తించారు. మృత దేహాలు వద్ద నాటు తుపాకీ, పిస్తోల్ లభ్యమయ్యాయి. కిరంథోల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు