రైల్వే ట్రాక్‌ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం!

13 Nov, 2022 17:29 IST|Sakshi

జైపూర్‌: ఉదయ్‌పుర్- అహ్మదాబాద్‌ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్‌ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ట్రాక్‌ దెబ్బతిన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. 

ఉదయ్‌పుర్‌ జిల్లా కెవ్డాలో ఉన్న ఓడ రైల్వే బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్‌ తారాచంద్‌ మీనా ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పేలుడు సంఘటన కలకలం సృష్టించిన క్రమంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ ట్వీట్‌ చేశారు. ఓడ రైల్వే వంతెనపై పేలుడుతో రైల్వే ట్రాక్‌ పాడవటం ఆందోళనకర విషయమని, సీనియర్‌ అధికారులు స్పాట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. వంతెన పునఃనిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ 31నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా?

మరిన్ని వార్తలు