రెడ్‌ సిగ్నల్‌‌ దాటిన రైలు: లోకో పైలట్‌ సస్పెండ్‌

27 Dec, 2020 15:43 IST|Sakshi

పాట్నా: తూర్పు మధ్య రైల్వేలోని దానపూర్ డివిజన్ పరిధిలో ఓ రైలు ప్రమాద రెడ్‌ సిగ్నల్‌ను దాటి వెళ్లింది. టాటా నగర్-బౌండ్ దానపూర్ మధ్య ప్రయాణించే టాటా ఎక్స్‌ప్రెస్‌ను ఒక్కసారిగా ప్రమాద రెడ్‌ సిగ్నల్‌ను దాటి సుమారు 500 మీటర్లు ముందుకు ప్రయాణించింది. ప్రమాద రెడ్‌ సిగ్నల్‌ను నిర్లక్ష్యంగా దాటించిన లోకో పైలట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ను రైల్వే అధికారులు సస్పెండ్‌ చేసినట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. సురక్షితమై రైలు ప్రయాణానికి సంబంధించి డేంజర్‌ సిగ్నల్స్‌పై నిర్లక్ష్యంగా వ్యహరించినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన జరిగన సమయంలో భారీ అలారం శబ్ధం వినిపించింది. సంబంధిత రైలు లోకో పైలట్‌ను రైల్వే అధికారులు అదుపులో తీసుకున్నారు. చదవండి: రక్తపోటు మందుతో దీర్ఘాయువు?

లోకో పైలట్‌ మద్యం సేవించి రైలు నడిపారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాద సిగ్నల్‌ను దాటడం నేరంగా కింద పరిగణించబడుతుందని, కొన్నిసార్లు ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన పేలవమైన బ్రేక్స్‌ ఉండటం వల్ల జరిగిందా? లేదా లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ నిర్లక్ష్యంగా రైలును ప్రమాద సిగ్న్‌కు ముందే నిలిపివేయడం మర్చిపోయారా? అనేది విచారణలో తేలనున్నది.

ఇటువంటి సంఘటనలను రైల్వే చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, ప్రయాణికులు రక్షణ కోసం రైలు సిగ్నల్స్‌ను‌ కచ్చితంగా పాటించాల్సిన ప్రోటోకాల్ ఉంటుందని చీఫ్‌ పీఆర్‌ రాజేష్‌ కుమార్‌ తెలిపారు. సంఘటన  చోటు చేసుకున్న సందర్భాల్లో ఎంత దూరం ప్రమాద సిగ్నల్‌ను రైలు క్రాస్‌ చేసిందో పరిశీలించాల్సిన బాధ్యత రైలు పర్యవేక్షకులు, స్టేషన్ మాస్టర్ ఉంటుందన్నారు. అదే విధంగా ఘటనకు గల కారణాలను స్టేషన్‌ మాస్టర్‌.. లోకో పైలట్‌ను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. రైలు ప్రయాణం తిరిగి ప్రారంభించడానికి ముందు ఘటనకు సంబంధిదంచిన అన్ని వివరాలను నోట్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు