అంతర్జాతీయ విమాన సర్వీస్‌ల రద్దు పొడిగింపు

29 Oct, 2020 03:43 IST|Sakshi

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌

న్యూఢిల్లీ: నవంబర్‌ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్‌ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్‌ వంటి 18 దేశాలతో భారత్‌ అంతర్జాతీయ సర్వీస్‌లను నడపడానికి ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది.

ముంబై విమానాలను అనుమతించం: హాంకాంగ్‌
గత వారం ముంబై నుంచి వచ్చిన విమానంలో కొంత మంది ప్రయాణికులకు కోవిడ్‌ ఉన్నట్టు తేలటంతో నవంబర్‌ 10 వరకు ముంబై నుంచి వచ్చే ఎయిర్‌ ఇండియా విమానాలను అనుమతించబోమని హాంకాంగ్‌ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో మాత్రమే భార తీయులు హాంకాంగ్‌కి ప్రయాణిం చవచ్చునని హాకాంగ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు