వివాహేతర సంబంధం: ‘అయేషా వస్తేనే నీ కొడుకు క్షేమంగా ఉంటాడు.. లేదంటే!’

5 Apr, 2023 10:24 IST|Sakshi
తండ్రితో బాలుడు ఆషిక్‌

ముంబై: వివాహేతర సంబంధం కోసం మహిళ కొడుకును అపహరించిన సంఘటన థానే జిల్లాలోని శాంతినగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టణంలోని మహ్మద్‌ అలీ ఫకీర్, అయేషా బీబీ దంపతులు టెమ్‌ఘర్‌ మురికివాడలో ఉంటున్నారు. రిపోన్‌ వ్యాపారి అనే వ్యక్తితో అయేషాకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. తనతోపాటు వచ్చేయాలని అయేషాపై ఒత్తిడి పెంచాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఏప్రిల్‌ 3న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న ఆమె కుమారుడు ఆషిక్‌ (4)ను కిడ్నాప్‌ చేశాడు.

ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించిన అలీ, అయేషా స్థానిక శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఇంటికి వచిన వారికి రిపోన్‌ వ్యాపారి ఫోన్‌ చేసి ‘మీ కుమారుడు నావద్దనే ఉన్నాడు. అయేషా వస్తేనే సురక్షితంగా ఉంటాడు. లేదంటే హతమారుస్తాను’ అని బెదిరించాడు. ఈ విషయాన్ని వెంటనే శాంతినగర్‌ పోలీసులకు తెలిపారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నాసిక్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గ్రహించిన సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తన బృందంతో 24 గంటల్లో నిందితుని పట్టుకొన్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు