భారత్ లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్?

25 May, 2021 15:42 IST|Sakshi

మన దేశంలో సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్ అవుతాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌పై నిబంధనల పేరిట కత్తి వేలాడుతోంది. సోషల్‌ మీడియా కట్టడికి ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త నియమావళి బుధవారం మే 26 నుంచి అమల్లోకిరానుంది. కొత్త నిబంధనలను పాటించటానికి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మూడు నెలల గడువు ఇచ్చింది. 

ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా కేంద్రం సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఈ గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పేలా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబందనలలో అనేక అంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ తొలగించడం వంటివి ఈ నియమాలలో ఉన్నాయి. 

ఏ సంస్థ కూడా ఇప్పటివరికి ఆ నిబందనలు అంగీకరించ లేదు. అందుకే ఇండియాలో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. మే 26 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఈ కంపెనీలు ఆరు నెలల సమయం కావాలని కోరాయి. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సోషల్ మీడియాల సర్వీసులు నిలిపివేయడమో లేదా తాత్కాలికంగా ఆగిపోవడమో జరిగే అవకాశం ఉంది.

చదవండి:

ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్‌


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు