అంద‌రికీ క‌రెంటు బిల్లు మాఫీ: నిజ‌మేనా?

2 Sep, 2020 08:01 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పుణ్య‌మాని అంద‌రూ ఇళ్ల‌లోనే ఉండ‌టంతో క‌రెంటు బిల్లులు త‌డిసి మోపెడ‌వుతున్నాయి. వాటిని క‌ట్ట‌లేక చాలామంది త‌ల ప్రాణం తోక‌కొస్తుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రికీ క‌రెంటు బిల్లులు షాకిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇక నుంచి క‌రెంటు బిల్లులు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదంటూ ఓ వార్త తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం "విద్యుత్ బిల్లు మాఫీ 2020" స్కీమ్ తెచ్చింద‌ని.. ఆ ప‌థ‌కం ప్ర‌కారం దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ విద్యుత్ బిల్లు క‌ట్టాల్సిన ప‌ని లేదన్న‌ది స‌ద‌రు వార్త సారాంశం. (‘కరోనా బ్యాక్టీరియా.. అస్పిరిన్‌తో తగ్గుతుంది’)

ఇది సెప్టెంబ‌ర్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుందంటూ ఓ యూట్యూబ్ వీడియోను కూడా జోడించి చాటింపు చేస్తున్నారు. ఇది నిజ‌మ‌ని న‌మ్మిన కొంద‌రు జ‌నాలు శుభ‌వార్త అంటూ దీన్ని ఇత‌రుల‌కు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అబ‌ద్ధ‌మేన‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ విభాగం పీఐబీ(ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో) తేల్చి చెప్పింది. అస‌లు కేంద్రం అలాంటి ప‌థ‌కాన్నే తీసుకురాలేద‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఎవ‌రూ ఈ త‌ప్పుడు వార్త‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది. (ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు