ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్‌

10 Nov, 2021 13:15 IST|Sakshi

ముంబై: ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్‌ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 6.5 బిలియన్‌ డాలర్లు(రూ.48 కోట్లు)తో అత్యంత సంపన్నురాలుగా మారారు.  అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు.

(చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు)

అంతేకాదు భారత్‌లో తొలిసారిగా ఒక మహిళ నేతృత్వంలోనైకా మాతృసంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ కామర్స్‌ వెంచర్‌ యూనికార్న్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ని ఒక్క ఊపూ ఊపింది. పైగా మార్కెట్ చేసిన శ్రేణిలో టాప్ ఎండ్‌లో నిర్ణయించిన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధర 53.5 బిలియన్ రూపాయలను ($722 మిలియన్లు) సమీకరించి ఒక్కసారిగా 78% నికి ఎగబాకింది. అంతేకాదు నాయర్‌ గతంలో ఒక అగ్రశ్రేణి భారతీయ పెట్టుబడి బ్యాంకుకు నాయకత్వం వహించారు.

నైకా స్థాపించక మునుపు  దేశంలోని చాలా మంది మహిళలు మేకప్ మరియు జుట్టు సంరక్షణ ఉత్పత్తులను పొరుగున ఉన్న మామ్ అండ్ పాప్ స్టోర్‌లలో కొనుగోలు చేశారు. 2012లో నైకాని స్థాపించి ఆకర్షణీయమైన బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీల డెమో వీడియోలతో ఆన్‌లైన్ విక్రయాలను సాగించి ఒక్కసారిగా దాదాపు 70 స్టోర్‌లను ప్రారంభించింది. దీంతో నైకా మంచి లాభదాయకమైన సంస్థగా నిలవడమేకాక పబ్లిక్‌ మార్కెట్‌లోకి అరగేట్రం చేసిన తొలి ఇంటర్నెట్‌ స్టార్టప్‌గా కూడా నిలిచింది.

(చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’)

మరిన్ని వార్తలు