వైరల్‌: బట్టలు చిరిగేలా కొట్టుకున్నారు

28 Jul, 2020 16:42 IST|Sakshi

తిరువనంతపురం : రోడ్డు విస్తరణకు సంబంధించిన విషయంలో పలు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో వారు వీధిలో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ గొడవలో పురుషులే కాకుండా మహిళలు కొట్టుకున్నారు. కేరళలోని అరట్టుపుజ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఒక చోట మూడు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు పంచాయతీ తీర్మానించింది. దీంతో అక్కడ వివాదం చెలరేగింది. (టార్గెట్‌ మహారాష్ట్ర : ప్లాన్‌ అమలు చేయండి)

రోడ్డు నిర్మాణం వల్ల తమ భూమి కోల్పోవాల్సి వస్తుందని కొన్ని కుటుంబాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. రోడ్డు వెడల్పు తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఇది అవతలివారికి రుచించలేదు. దీంతో వారి మధ్య మొదలైన వాగ్వాదం.. కొట్లాటకు దారితీసింది. పలు కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలైతే కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. దుస్తులు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా, కరోనా వ్యాప్తి క్రమంలోనే ఈ వాగ్వాదం జరిగిందనే వదంతులను అధికారులు తోసిపుచ్చారు. ఈ ఘర్షణకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (‘ప్రపంచంలోనే మొదటి విద్యుద్దీకరణ టన్నెల్‌ ఇది’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు