పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రెండో పెళ్లి.. వధువు ప్రత్యేకత ఏంటంటే..?

6 Jul, 2022 20:04 IST|Sakshi

Details About Bride Gurpreet Kaur.. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(49) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ అనే యువతితో గురువారం సీఎం మాన్‌ వివాహం జరుగనుంది. ఛండీగడ్‌లో.. అతి తక్కువ మంది సభ్యుల మధ్య వీరి వివాహం జరుగనున్నట్టు తెలుస్తోంది. 

కాగా, సీఎం భగవంత్‌ మాన్‌కు ఇది రెండో వివాహం. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న 7 ఏళ్ల తర్వాత భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకుంటున్నారు. ఇంద్రప్రీత్‌ కౌర్‌ను మొదటి వివాహం చేసుకుని.. వ్యక్తిగత కారణాలతో 2015లో విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.
కాగా, రెండో వివాహం చేసుకోబోతున్న గురుప్రీత్‌ కౌర్‌ గురించి సోషల్‌ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఆమె ఎవరూ అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే, గురుప్రీత్‌ కౌర్‌(32).. కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందినది. ఆమె తండ్రి.. ఇంద్రజీత్‌ సింగ్‌ ఓ రైతు కాగా ఆమె తల్లి మాతా రాజ్‌కౌర్‌ గృహిణి. గురుప్రీత్‌ కౌర్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిద్దరూ విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. మెడిసిన్‌ చదివిన గురుప్రీత్‌ కౌర్‌.. గోల్డ్‌ మెడల్‌ సాధించినట్టు ఆమె.. మేనమామ గురీందర్‌ జీత్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భగవంత్ మాన్‌కు గురుప్రీత్‌ కౌర్‌ సహాయం చేసినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు