ఆడపిల్ల పుట్టిందని.. హెలికాఫ్టర్‌ బుక్‌ చేశాడు..ఎందుకంటే!

23 Apr, 2021 12:11 IST|Sakshi

జైపూర్‌: దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. అని ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అరిష్టం, మగ పిల్లాడు పుడితే అదృష్టంగా భావించే కుటుంబాలు ఉన్నాయని మనం అప్పడప్పుడూ వార్తల్లో వింటూనే ఉంటాం. అంతేందుకు త‌ల్లిదండ్రులు త‌మ‌ కొడుకును ఒక‌విధంగా, కూతురిని మ‌రోలా చూడ‌టంలాంటివి  ఘటనలు ఒక్కోసారి మన ఇరుగు పొరుగు ఇంటిలోనే మనకు తారసపడే ఉంటాయి. అయితే ఇలాంటి అస‌మాన‌త‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అంటూ సంబరాలు చేసుకుంది ఓ రాజ‌స్థానీ కుటుంబం. 35 ఏండ్ల త‌ర్వాత త‌మ కుటుంబంలో లేక‌లేక జ‌న్మించిన ఆడబిడ్డ‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ చిన్నారి త‌మ ఇంట్లో అడుగుపెట్టే శుభ‌ ముహూర్తాన్ని ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఉంచుకోవాల‌నుకుంది ఆ కుటుంబం. అందుకోసం ఏకంగా ఓ హెలికాఫ్ట‌ర్‌నే బుక్‌చేశారు.

వివరాల్లోకి వెళితే..  రాజ‌స్థాన్‌లోని నౌగౌర్ జిల్లాలోని నిమిబ్డి చందావ‌తాకు చెంది హ‌నుమాన్ ప్ర‌జాప‌త్‌, చుకిదేవి దంప‌తులు. వారికి గ‌త నెల‌లో ఆడ శిశువు జ‌న్మించింది. అయితే ప్ర‌స‌వం అనంత‌రం ఆస్పత్రి నుంచి ఆమె త‌న పుట్టింటికి వెళ్లింది. ఆ చిన్నారి తాత మదన్ లాల్ కుమ్హార్ కుటుంబంలో గత 35 సంవత్సరాలుగా ఆడపిల్లలు జన్మించనే లేదు. ఇన్నేళ్ల తరువాత త‌మ కుటుంబంలోకి ఓ ఆడపిల్ల రావ‌డంతో హ‌నుమాన్‌తోపాటు, అత‌ని త‌ల్లిదండ్రులు ఖుషీ అయ్యారు. పాప‌కు నెల రోజులు నిండ‌టంతో త‌మ ఇంటికి తీసుకువాల‌నుకున్నారు. అయితే ఆ చిన్నారిని త‌మ ఇంట్లోకి ఘ‌నంగా ఆహ్వానించాల‌ని,  అది ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఉండాల‌నుకున్నారు. అందుకోసం ఓ హెలికాప్ట‌ర్‌ను బుక్‌ చేసుకున్నారు. ఇంకేముంది ఊరంతా తెలిసేలా హెలికాఫ్టర్‌లో తన మనవరాలిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ పాప రాకను ఓ పండుగలా జరుపుకున్నారు. 

( చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! )

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు