రబ్బర్‌ ట్యూబ్‌కు మృతదేహం కట్టి నది దాటించిన గ్రామస్థులు

16 Aug, 2022 14:58 IST|Sakshi

భోపాల్‌: భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి గ్రామానికి దారి లేకుండా మారింది. ఊళ్లోకి వెళ్లాలంటే వరద దాటుకునే వెళ్లాలి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని గ్రామానికి చేర్చేందుకు రబ్బర్‌ ట్యూబే వారికి ఆసరాగా మారింది. ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నది దాటించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అనుప్పుర్‌ జిల్లాలోని తాడ్‌పతారా గ్రామానికి చెందిన 55 ఏళ్ల విశ్మాట్‌ నందా అనే వ్యక్తి పక్క జిల్లా డిండోరాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని పతర్‌కుచాకు తీసుకొచ్చారు. నర్మదా నది వరదలతో ఉప్పొంగటం వల్ల పతర్‌కుచా నుంచి తాడ్‌పతరాకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. అక్కడ ఎలాంటి వంతెన లేదు. దీంతో రబ్బర్‌ ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నదిని దాటించారు గ్రామస్థులు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అభిషేక్‌ చౌదరి తెలిపారు.

ఇదీ చదవండి: భారత జాతీయ గీతం ‘జనగణమన​‍’ వినిపించి పాక్‌ మ్యుజీషియన్‌ కానుక!

మరిన్ని వార్తలు