రూ. 1.5 కోట్ల డ్రీమ్‌ హౌస్‌... కూల్చడం ఇష్టం లేక ఇంటినే తరలిస్తున్న రైతు

20 Aug, 2022 12:42 IST|Sakshi

రొడ్డు విస్తరణలో భాగంగా లేదా హైవే నిర్మించడం కోసం ప్రభుత్వం కొన్ని ఇళ్లను తొలగిస్తుంటుంది. ఇది సర్వ సాధారణం. అందుకు ప్రభుత్వం వారికి నష్ట పరిహారం కూడా ఇస్తుంది. ఐతే అచ్చం అలాంటి పరిస్థితే ఒక రైతుకు ఎదురైంది. కానీ ఆ రైతు అందుకు ససేమిరా అంటే ఏకంగా ఇంటినే తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. 

పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన  రైతు సుఖ్‌విందర్‌ సింగ్‌ తన డ్రీమ్‌ హౌస్‌ని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే తరిలించిందేకు సిద్ధమయ్యాడు. సంగ్రూర్‌ జిల్లాలోని రోషన్‌వాలా గ్రామంలో తన స్థలంలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న ప్రదేశం ఎక్స్‌ప్రెస్‌ వే రోడ్డుని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌మాల ప్రాజెక్ట్‌ కింద నిర్మిస్తున్న ఈ రహదారిని ఢిల్లీ, అమృత్‌సర్‌ కత్రా ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు  అధికారులు తెలిపారు.

ఈ ఎక్‌ప్రెస్‌ వే  హర్యానా, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌ మీదుగా వెళ్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఖ్‌విందర్‌ సింగ్‌ అనే రైతుకి తన ఇంటిని కూల్చివేసేందుకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఐతే సుఖ్‌విందర్‌కి తన ఇంటిని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే మరోక ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అంతేకాదు అతను భవన నిర్మాణ కార్మికుల సహకారంతో సుమారు 250 అడుగుల మేర ఉన్న ఇంటిని 500 అడుగులు దూరం కదిలించేందుకు పనులు కొనసాగిస్తున్నాడు.

భవనాన్ని కదిపేందుకు చక్రాల వలే కనిపించే గేర్‌లను కూడా ఏర్పాటు చేశాడు. ఆ రైతు ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చు అయ్యిందని, అదే సమయంలో ఇంటిని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ అమృత్‌సర్‌ కత్రా ఎక్‌ప్రెస్‌వే ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టు అని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవత్‌ మాన్‌ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.  పైగా ఈ రహదారి వల్ల కాశ్మీర్‌కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతుందని చెప్పారు.

(చదవండి: చిచ్చు రేపిన తాగుడు అలవాటు... ఖతం చేసి సెల్ఫీ వీడియో!)

మరిన్ని వార్తలు