పంట పొలాల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన కొండ చిలువ‌లు

25 Aug, 2020 22:25 IST|Sakshi

డెహ్రాడూన్‌: ప‌ంట పొలాల్లో ప‌నిచేసేందుకు వెళ్లిన రైతుల‌కు భ‌యాన‌క అనుభ‌వం ఎదురైంది. అక్క‌డ సుమారు 10 అడుగుల పొడ‌వు గ‌ల రెండు కొండ చిలువ‌లు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో వారు బెంబేలెత్తిపోయారు. వెంట‌నే అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచార‌మిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పాముల‌ను ప‌ట్టి అడ‌విలో విడిచిపెట్టారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని గౌలాపర్ అనే ప్రాంతంలో సోమ‌వారం జ‌రిగింది. 

ఈ విష‌యం గురించి అట‌వీ శాఖ అధికారి ఒక‌రు మ‌ట్లాడుతూ.. ఆ రెండు పైథాన్లు 10 నుంచి 12 అడుగుల పొడ‌వు ఉన్నాయి. సీజ‌న్ మారుతున్న స‌మ‌యంలో త‌ర‌చుగా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ రెండింటిని అడ‌విలో వదిలిపెట్టాం అని చెప్పుకొచ్చారు. ఇక పంట పొలాల్లో కొండ చిలువ‌ల‌ను సుర‌క్షిత ప‌ద్ధ‌తిలో బంధించి వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. ఈ క్ర‌మంలో కొంత‌మంది నెటిజ‌న్లు రెస్క్యూ టీం ధైర్యాన్ని కొనియాడుతుండ‌గా.. మ‌రికొంద‌రు.. ఇది చాలా భ‌యంకరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు