ఢిల్లీలో రైతుల ఆందోళన: భద్రత పెంచిన పోలీసులు

26 Jun, 2021 13:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనకు దిగి ఏడు నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా రైతులు శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ నివాసాన్ని ముట్టడించి మెమోరాండం సమర్పించనున్నట్లు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వెలుపల భద్రతా బలగాలను పెంచారు.

రాజ్‌భవన్ ముట్టడి నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రోస్టేషన్లు మూసివేశారు. అదే విధంగా టిక్రి, సింగ్‌, ఘాజీపూర్‌ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని ప్రధాన జాతీయ రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఆందోళనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
చదవండి: కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్‌

>
మరిన్ని వార్తలు