సిద్ధూ కామెంట్లపై రైతుల ఫైర్‌! 

25 Jul, 2021 08:49 IST|Sakshi
నిరసనలు తెలియజేస్తున్న రైతులు

చండీగఢ్‌ : నూతన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల చేపట్టిన సందర్భంగా శుక్రవారం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేసిన కామెంట్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రూప్‌నగర్‌ జిల్లాలో సిద్ధూకు వ్యతిరేకంగా నిరసలు చేపట్టారు. గురుద్వారాలో ప్రార్థనల కోసం వచ్చిన ఆయనకు నల్ల జెండాలతో స్వాగతం పలికారు.  ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా, శుక్రవారం తను చేసిన కామెంట్లపై సిద్ధూ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. రైతుల పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉందని, వారి ఉద్యమానికి మనసా,వాచ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని.. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు.

శుక్రవారం పీసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ..‘‘ కిషన్‌ మోర్చా పెద్దలు.. మీరు దాహంతో బావి వైపు అడుగులు వేస్తున్నారు. ఆ బావి మీ దప్పిక తీర్చదు. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు